: రైలుకి ఎదురుగా వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమజంట... కాపాడిన స్థానికులు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషన్ వద్ద ఈ రోజు ఉదయం ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ జంట రైలుకి ఎదురుగా వెళుతుండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని కాపాడారు. ప్రేమ జంటను పట్టాలపై నుంచి బయటకు లాక్కురావడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ప్రేమజంటను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోకపోవడమే వారి ఆత్మహత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది.