: ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్... రూట్ హాఫ్ సెంచరీ
మొహాలీలో జరుగుతున్న మూడో టెస్టు నాలుగోరోజు ఆటను ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 78 పరుగులతో ప్రారంభించింది. 36 పరుగులతో రూట్, 0 పరుగులతో బ్యాటీ ఆటను మొదలుపెట్టారు. మ్యాచ్ రెండో ఓవర్లోనే బ్యాటీ (0)ని జడేజా పెవిలియన్ చేర్చాడు. తాను వేసిన రెండో బంతికే బ్యాటీని ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బట్లర్ కూడా 18 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు ఓపెనర్ రూట్ మరో హాఫ్ సెంచరీ చేసి (54) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. రూట్ కు తోడుగా హమీద్ (1) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 119 పరుగులు. మన బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు, జయంత్ యాదవ్ 2, జడేజా ఒక్క వికెట్ తీశారు.