: పోలీసులపై రాళ్లు రువ్విన ఎర్ర దొంగలు
టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం రైల్వే గేటు వద్ద నిన్న రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే, నిన్న రాత్రి అటవీ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కలసి ఎర్రచందనం స్మగ్లర్ల కోసం సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో, నరసింగాపురం రైల్వే గేటు వద్ద 50 మందికి పైగా ఎర్రచందనం స్మగ్లర్లు దుంగలను అక్రమ రవాణా చేస్తూ ఎదురుపడ్డారు. వీరిని పట్టుకునేందుకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ప్రయత్నించగా, వీరిపై స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు కూడా దీటుగా స్పందించడంతో... వారు పరారయ్యారు. ఈ సందర్భంగా, 48 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.