: మల్లన్న సన్నిధిలో 'డ్రమ్స్ శివమణి' శివతాండవం!


ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం కార్తీకమాసపు చివరి రోజున భక్తులతో కిటకిటలాడింది. శ్రీశైలం, వేములవాడ, శ్రీకాళహస్తి, దాక్షారామం, కాళేశ్వరం, మహానందితో సహా తెలుగురాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పట్టణాల్లోని శివాలయాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి. నిన్న కార్తీకమాసపు ఆఖరి సోమవారం కావడంతో భక్తి శ్రద్ధలతో భక్తులు పరమ శివుడిని అర్చించారు. ప్రముఖ డ్రమ్స్ వాద్య కళాకారుడు శివమణి శ్రీశైల మల్లన్న సన్నిధిలో చేసిన ప్రదర్శన అద్భుత రీతిలో సాగింది. ఓ వైపు దీప కాంతులతో మహాక్షేత్రం దేదీప్యమానంగా వెలుగులు విరాజిల్లుతుండగా, వివిధ రకాల డ్రమ్స్, శంఖాలు ఊదుతూ శివమణి 'శివతాండవ లయవిన్యాసం' భక్తులను మైమరపింపజేసింది. కాగా, నేటితో కార్తీకమాసం ముగిసి మార్గశిరమాసం రానుంది.

  • Loading...

More Telugu News