: ఓహియో స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం


అమెరికాను కాల్పులు బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న తెల్లవారు జామున న్యూఆర్లెన్స్ లో దుండగుడు కాల్పులు జరపగా 9 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కొలంబస్ లోని ఒహియో స్టేట్ యూనివర్శిటీలోని ఇంజినీరింగ్ భవనంలోకి చొరబడ్డ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో అంతా బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన యూనివర్శిటీ అధికారులు, యూనివర్సిటీ ప్రధాన ద్వారాలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో యూనివర్సిటీలోని మిగిలిన విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుడు కూడా యూనివర్సిటీలోనే వున్నాడు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News