: బ్యాంకులపై హైకోర్టులో పిల్ వేసిన ఎంవీ మైసూరారెడ్డి


ప్రజలు డిపాజిట్ చేసుకున్న డబ్బులను బ్యాంకులు ఖాతాదారులకు ఇవ్వడం లేదని, కొన్ని బ్యాంకులను మూసేశారని వైఎస్సార్సీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇలా డబ్బులు లేవని బ్యాంకులు మూసేయడమంటే ఐపీ పెట్టి పారిపోయిన నేరంతో సమానమని ఆయన పిల్ లో పేర్కొన్నారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. ప్రతి కరెన్సీ నోటు ప్రాంసరీ నోటుతో సమానమని, దానిపై ఎప్పుడు కావాలంటే అప్పుడు చెల్లిస్తానని ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుందని ఆయన తెలిపారు. అలాంటిదానిని తుంగలో తొక్కి డబ్బులు లేవని చెప్పడం ఐపీ పెట్టడంతో సమానమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News