: జీతాల గురించి ఇంకా నిర్ణయించలేదు: కేసీఆర్
తెలంగాణ ఉద్యోగులు జీతాల్లో కొంత భాగం నగదు కావాలని అడుగుతున్నారని, దానికి బ్యాంకర్లతో చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. అందువల్ల ప్రభుత్వోద్యోగుల జీతాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అలాగే ఆసరా పెన్షన్లు ఇంతవరకు ఎలా ఇస్తున్నామో ఇకపై కూడా అదే విధానం అమలు జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ స్కీము గురించి తెలిస్తే... తనపై ఆరోపణలు చేసే సన్నాసులు అలా చేయరని కేసీఆర్ మండిపడ్డారు. కొన్ని వ్యాఖ్యలు బాధనిపిస్తాయని ఆయన చెప్పారు.