: సినీ రంగంలో బ్లాక్ మనీ ఎక్కువగా ఉందనేది అవాస్తవం: కేంద్ర మంత్రి రాథోడ్
సినిమా పరిశ్రమలో నల్లధనం ఎక్కువగా ఉంటుందని అందరూ భావిస్తుంటారని... కానీ, అందులో వాస్తవం లేదని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. సినీ రంగంలో లావాదేవీలన్నీ ఎక్కువగా చెక్కుల ద్వారానే జరుగుతాయని... పెట్టుబడులకు కావాల్సిన డబ్బులను బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకుంటారని ఆయన చెప్పారు. అందువల్ల సినీ రంగంలో నల్లధనం ఉండే అవకాశం లేదని అన్నారు. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత సినీ రంగంలో నల్లధనాన్ని భారీగా పెట్టుబడిగా పెట్టారనే వార్తలన్నీ అవాస్తవమని తెలిపారు. నోట్ల రద్దు వల్ల ఫిలిం ఇండస్ట్రీకి మంచే జరిగిందని అభిప్రాయపడ్డారు. మోదీ నిర్ణయంతో తీవ్రవాదం, నేరాలు, డ్రగ్స్, దొంగతనాలు తగ్గుతాయని చెప్పారు.