: అమరావతి మెట్రోకు టెండర్ల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరాతి మెట్రో రైలుకు తొలి అడుగు పడింది. మెట్రో ప్రాజెక్టులో రెండు కారిడార్లకు డీఎంఆర్ సీ (ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) ఈ రోజు టెండర్లకు ఆహ్వానించింది. జనవరి 19వ తేదీని టెండర్లకు చివరి తేదీగా నిర్ణయించింది. తొలి కారిడార్ ను విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి నిడమలూరు వరకు 13.5 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. రెండో కారిడార్ ను పీఎస్ డీఎస్ నుంచి పెనమలూరు వరకు 12.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు.