: అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డు...23 పరుగులకే ఆలౌట్


అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో రికార్డు నమోదైంది. కేవలం 23 పరుగుల అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అయి, నేపాల్ మహిళా జట్టు రికార్డు పుటలకెక్కింది. వివరాల్లోకి వెళ్తే... మహిళల ఆసియా కప్ లో భాగంగా శ్రీలంక మహిళా జట్టు బౌలర్లు నిప్పులు చెరిగారు. వారి ధాటికి ఏడుగురు బ్యాట్స్ ఉమన్ డకౌట్ కగా, ఒక బ్యాట్స్ ఉమన్ పరుగులేమీ చేయకుండా క్రీజులో నాటౌట్ గా నిలవడం విశేషం. జ్యోతి పాండే (16) మాత్రమే డబుల్ డిజిట్ చేయడం విశేషం. దీంతో కేవలం 16.2 ఓవర్లలో 23 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బౌలర్లలో సుగంధి కుమారి, రణవీరా చెరి మూడు వికెట్లు తీయగా, రంగసింఘే రెండు వికెట్లు తీసి ఆకట్టుకుంది. ఈ లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సాధించింది. మరో మ్యాచ్ లో బంగ్లా మహిళా జట్టు విసిరిన 89 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక, ధాయ్ లాండ్ మహిళా జట్టు 53 పరుగులకే ఆలైట్ అయింది.

  • Loading...

More Telugu News