: సత్యసాయి బాబా సూక్ష్మరూపంలో మనతోనే ఉన్నారు: ప్రధాని మోదీ


పుట్టపర్తి సత్యసాయి బాబా సూక్ష్మరూపంలో మనతోనే ఉన్నారని, ఆయన ఆశీర్వాదం మనకు బలాన్ని ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శ్రీ సత్యసాయి సంజీవని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ చైల్డ్ హెల్త్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలుపుతున్నానని, సత్యసాయిబాబా పాద పద్మాలకు నమస్కరిస్తున్నానని అన్నారు. సత్యసాయిబాబా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని, విద్యా, వైద్య రంగాల్లో ఈ సంస్థల కృషి అమోఘం అని ప్రశంసించారు. పేద ప్రజల కోసం సత్యసాయి చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News