: సీనియర్లతో భేటీ అయిన జగన్... తాజా సర్వేలపై చర్చించేందుకే!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, తనకు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ఈ ఉదయం చర్చలు జరిపారు. ఓ టెలివిజన్ చానల్ లో 'ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే...' అంటూ వచ్చిన సర్వే ఫలితాలపై చర్చించేందుకే జగన్, తన పార్టీ నేతలను పిలిచినట్టు తెలుస్తోంది. పార్టీ నేతలు విజయసాయి రెడ్డి సహా పలువురు ఈ ఉదయం ఆయన ఇంటికి వెళ్లి కలిసి చర్చించారు. ఇక రెండున్నర ఏళ్ల నాటి టీడీపీ బలం తగ్గలేదని, వైకాపా మాత్రం పట్టు కోల్పోయిందని ఈ సర్వేలో వెల్లడైన సంగతి తెలిసిందే. కాగా, ఈ చర్చల అనంతరం వైకాపా అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించవచ్చని తెలుస్తోంది.