: హెచ్ సీఏ కార్యాలయంలో 34 మంది మాజీ క్రికెటర్ల భేటీ


హైదరాబాద్ రంజీ జట్టుకు ఆడిన 34 మంది మాజీ క్రికెటర్లు జింఖానా గ్రౌండ్స్ లోని హెచ్ సీఏ కార్యాలయంలో నిన్న భేటీ అయ్యారు. లోథా కమిటీ సిఫారసులను హెచ్ సీఏ అమలు చేయడంపై వీరు ప్రముఖంగా చర్చించారు. ఈ సందర్భంగా వారంతా వారివారి అభిప్రాయాలను వెల్లడించారు. అంతేకాదు, ప్రస్తుత నిబంధనల మేరకు ప్లేయర్ల సంఘాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒక స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఈ కమిటీ కేవలం మధ్యంతర కమిటీ మాత్రమేనని... ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకునేంత వరకు మాత్రమే ఇది పని చేస్తుందని విజయ్ మోహన్ రాజ్ తెలిపారు. ఈ కమిటీలో వెంకటపతిరాజు, నోయల్ డేవిడ్, విజయ్ మోహన్ రాజ్, ఎంవీ నరసింహారావులు ఉన్నారు. శివలాల్ యాదవ్ ను కూడా కమిటీలోకి తీసుకోవాలని భావిస్తున్నామని... ఆయన సమ్మతి మేరకు తుది నిర్ణయాన్ని తీసుకుంటామని మోహన్ రాజ్ చెప్పారు.

  • Loading...

More Telugu News