: ఫిలిప్పీన్స్ లోని అమెరికా ఎంబసీ వద్ద బాంబు కలకలం


ఫిలిప్పీన్స్ లోని అమెరికా ఎంబసీ వద్ద బాంబు కలకలం సృష్టించింది. ఈరోజు ఉదయం 7.30 గంటల సమయంలో రోక్సాస్ బూల్ వార్డ్ లోని దౌత్య కార్యాలయం వద్ద వీధిని శుభ్రం చేస్తున్న కార్మికుడు ఈ బాంబును గుర్తించాడు. అక్కడి చెత్త డబ్బాలో ఓ ఫోన్ కి నలుపు, ఎరుపు వైర్లు చుట్టి ఉన్న ఒక వస్తువు ఉండటం చూసిన ఆ వ్యక్తి, ఆ సమాచారం అధికారులకు చేరవేశాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడికి చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ సాయంతో ఆ బాంబును నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలో ఆ రహదారిని సుమారు గంటపాటు మూసివేశారు.

  • Loading...

More Telugu News