: హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న విద్యార్థినుల అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
హైదరాబాదులో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థునుల అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. సరూర్‌నగర్‌కు చెందిన విద్యార్థినులు జిల్లెలగూడ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరు ముగ్గురు కలిసి ట్యూషన్ కు వెళ్తున్నట్టు చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. అయితే ఆ తర్వాత వారి ఆచూకీ కనిపించకుండా పోయింది. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థినుల అదృశ్యంపై మీర్‌పేట పోలీసులకు బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. విద్యార్థినులను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ముగ్గురు కలిసి ఎక్కడికైనా వెళ్లారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.