: ‘నడిగర్ సంఘం’ సమావేశంలో రెండు వర్గాల ఘర్షణ


దక్షిణ భారత సినిమా కళాకారుల సంఘం ‘నడిగర్ సంఘం’ సమావేశం ప్రారంభమవుతున్న సమయంలో రెండు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. చెన్నైలో సమావేశం నిర్వహిస్తున్న ప్రాంగణం బయట ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో నటుడు కరుణాస్ కు చెందిన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. నటులు శరత్ కుమార్, రాధా రవిలను సస్పెండ్ చేస్తూ నడిగర్ సంఘం కార్యనిర్వాహక కమిటీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే వారి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. మరోవర్గం వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఘర్షణ చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News