: అందుకోసమే, నా పేరు ఎడిట్ చేసుకోవాల్సి వచ్చింది: తనికెళ్ల భరణి


చిన్నప్పుడు తన తల్లిదండ్రులు పెట్టిన పేరు తనికెళ్ల దశ భరణి అని, స్కూల్లో పిల్లలు రకరకాలుగా తన పేరును పిలిచే వారని, దీంతో తన పేరు ఎడిట్ చేసుకుని తనికెళ్ల భరణిగా మార్చుకున్నానని ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘దశమి రోజున, భరణి నక్షత్రం రోజున నేను పుట్టడంతో మా నాన్నగారు దశ భరణి అని పేరు పెట్టారు. బడికి వెళ్లినప్పుడు తోటి విద్యార్థులు నా పేరును రకరకాలుగా పలికేవారు. దీంతో, మా నాన్న గారికి చెప్పి నా పేరును తనికెళ్ల భరణిగా మార్చేసుకున్నాను’ అని భరణి చెప్పారు. చిన్నప్పటి నుంచి తనకు హరికథ అంటే ఇష్టమని, హరికథ చెప్పేవాళ్లను అనుకరించే వాడినని, నటనపై ఆసక్తి కలగడానికి అదే నాంది అని భరణి చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News