: కార్పెంటర్ కళ్లల్లో కారం కొట్టి దారుణ హత్య


కార్పెంటర్ కళ్లల్లో కారం కొట్టి అతన్ని దుండగులు హతమార్చారు. ఈ దారుణ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏలూరు పాత బస్టాండ్ సమీపంలోని బండేటివారి వీధిలో సైకిల్ పై వెళుతున్న కార్పెంటర్ లక్ష్మణ రావు (40) అనే వ్యక్తి కళ్లల్లో కారం కొట్టిన ముగ్గురు వ్యక్తులు, అతన్ని కత్తులతో పొడిచి చంపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్పీ భాస్కర్ భూషన్ మాట్లాడుతూ, కార్పెంటర్ లక్ష్మణరావు స్థానిక లంబాడపేటలో నివసిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. హోండా యాక్టివా బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా తెలుస్తోందని, నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని చెప్పారు.

  • Loading...

More Telugu News