: మోదీని దేవదూతగా వెంకయ్యనాయుడు పోల్చడం విడ్డూరం: కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీని దేవదూతగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పోల్చడం విడ్డూరంగా ఉందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. రాజ్యసభ సీటు ఇచ్చినందుకే మోదీని దేవదూతగా ఆయన పోలుస్తున్నారని, ఏపీకి ప్యాకేజీ పేరిట భ్రమలు కల్పిస్తున్నారని, ‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం అని రఘువీరా అభివర్ణించారు. రైతులకు బీజేపీ ద్రోహం చేస్తోందని, నోట్ల రద్దుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నోట్ల రద్దు సామాన్యుల పాలిట మరణశాసనంగా మారిందని, నోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణమని రఘువీరా రెడ్డి ఆరోపించారు.