: తొలి ఇన్నింగ్స్ లో తడబడ్డ భారత్.. పార్థివ్, విజయ్ అవుట్


మొహాలీలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టును 283 పరుగులకు పరిమితం చేసిన భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో ఆదిలోనే తడబడింది. స్కోరు బోర్డుపై 73 పరుగులు జోడించేసరికే ఇద్దరు ఓపెనర్ల వికెట్లనూ కోల్పోయింది. మురళీ విజయ్ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోక్స్ బౌలింగ్ లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ దారి పట్టగా, చాలా కాలం తరువాత జట్టులోకి వచ్చిన పార్థివ్ పటేల్ 42 పరుగులు చేసి రషీద్ బౌలింగ్ ఎల్బీ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం పుజారా, కోహ్లీ ఆడుతుండగా, బారత స్కోరు 30 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 81 పరుగులు.

  • Loading...

More Telugu News