: రెండో రోజు నాలుగు ఓవర్లు కూడా ఆడకుండానే ఇంగ్లండ్ ఆలౌట్
మొహాలీలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టులో తొలి రోజు ఆటను 8 వికెట్ల నష్టానికి 268 పరుగుల వద్ద ముగించిన ఇంగ్లండ్ జట్టు, రెండో రోజు ఆరంభంలోనే చాపచుట్టేసింది. తొలి రోజు స్కోరుకు 15 పరుగులను మాత్రమే చేర్చగలిగింది. నాలుగు ఓవర్లు కూడా పూర్తి కాకుండానే చేతిలో మిగిలివున్న రెండు వికెట్లనూ కోల్పోయింది. నేడు రెండో ఓవర్ ను వేసిన షమీకి... అంటే ఇన్నింగ్స్ 91.1 బంతికి రషీద్, ఆపై 93.5వ బంతికి బాట్టీ వికెట్ల ముందు దొరికిపోయారు. ఈ రెండు వికెట్లూ షమీకే చిక్కాయి. ఇంగ్లండ్ జట్టు 283 పరుగుల వద్ద ఆలౌట్ కాగా, మరికాసేపట్లో భారత ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది.