: నెక్లెస్‌రోడ్‌లో ప్రారంభమైన 10కె రన్.. పరుగులు తీస్తున్న కేటీఆర్, సానియా, హీరో రాంచరణ్
ఈ ఉదయం హైదరాబాద్, నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఫ్రీడం హైదరాబాద్ 10కె రన్ ప్రారంభమైంది. పేర్లు నమోదు చేసుకున్న వేలాదిమంది కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివచ్చారు. మంత్రి కె.తారకరామారావు, మేయర్ బొంతు రామ్మోహన్, సీపీ మహేందర్‌రెడ్డి, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా, టాలీవుడ్ స్టార్ రాంచరణ్ సహా పలువురు ప్రముఖులు హాజరై పరుగులో పాల్గొన్నారు. 6:15 గంటలకు 10 కె రన్ ప్రారంభం కాగా, 7 గంటలకు 5కె రన్ ప్రారంభం కానుంది.