: కదిరి టీడీపీ ఎమ్మెల్యేకు నిరసనల సెగ
అనంతపురం జిల్లా కదిరి టీడీపీ ఎమ్మెల్యే చాంద్ బాషాకు సొంత పార్టీ నుంచే నిరసన సెగ ఎదురైంది. జనచైతన్య యాత్రలో భాగంగా చాంద్ బాషా నల్లచెరువు మండలం గోరంట్లవారిపల్లెకు వెళ్లారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ను పార్టీకి దూరం చేస్తున్నారంటూ స్థానిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలుగా టీడీపీ కార్యకర్తలు విడిపోయి వాగ్వాదానికి దిగారు. ఇది చిలికిచిలికి గాలివానగా మారడంతో బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, ఇరు వర్గాలకు సర్దిచెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది.