: దేశ వ్యాప్తంగా పలు ఆలయాల్లో నందమూరి బాలకృష్ణ అభిమానుల పూజలు


సినీనటుడు నందమూరి బాలకృష్ణ న‌టిస్తోన్న 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఆ సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఈ రోజు విజ‌య‌వాడ‌లోని క‌న‌క‌దుర్గ ఆల‌యంలో ఆయ‌న అభిమానులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణిలాంటి గొప్ప ధీశాలిపై సినిమాను తీయడం, ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం అమరావతి నిర్మాణం జ‌రుపుతుండ‌డం గొప్ప విశేష‌మ‌ని వారు వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా దేశంలోని ప్రముఖ ఆలయాల్లోనూ తాము పూజలు నిర్వహిస్తున్నట్లు మీడియాకు చెప్పారు.

  • Loading...

More Telugu News