: నిలబడ్డ బెయిర్ స్టోను బలిగొన్న జయంత్ యాదవ్!


ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ కు ప్రాణం పోసిన జానీ బెయిర్ స్టో ను కొత్త ఆటగాడు జయంత్ యాదవ్ బలిగొన్నాడు. మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టు తడబడి నిలబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు టీమిండియా బౌలర్ల ధాటికి తడబడింది. హమీద్ (9), రూట్ (15), కుక్ (27), అలీ (16), స్టోక్స్ (29) ఆకట్టుకోలేకపోగా, జోస్ బట్లర్ (43) కీలక సమయంలో అవుటయ్యాడు. కుక్ అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో... మొయిన్ అలీ తో కలిసి 36 పరుగులు, స్టోక్స్ తో కలిసి 57 పరుగులు, బట్లర్ తో కలిసి 69 పరుగులు, వోక్స్ తో కలిసి 45 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 89 పరుగుల వద్ద జయంత్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 258 పరుగుల వద్ద ఏడో వికెట్ ను కోల్పోయింది.

  • Loading...

More Telugu News