: యూఎస్ లో టెన్షన్... అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి విస్కాన్సిన్ రాష్ట్రంలో రీకౌంటింగ్
అమెరికాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి మూడు రాష్ట్రాల్లో రీకౌంటింగ్ జరపాలని డిమాండ్లు పెరిగిన నేపథ్యంలో, విస్కాన్సిన్ రాష్ట్ర ఎన్నికల సంఘం రీకౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో రీకౌంటింగ్ జరపాలని గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్ ఎన్నికల సంఘానికి విన్నవించారు. ఆయన విన్నపానికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఈ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ స్వల్ప తేడాతో గట్టెక్కింది. రీకౌంటింగ్ లో 30 లక్షల ఓట్లను మళ్లీ లెక్కించనున్నారు. అయితే, ఈ రీకౌంటింగ్ కు అయ్యే ఖర్చును గ్రీన్ పార్టీనే భరించనుంది. మన కరెన్సీలో ఈ ఖర్చు రూ. 7.5 కోట్ల వరకు ఉంటుంది. ఫెడరల్ డెడ్ లైన్ ప్రకారం డిసెంబర్ 13 లోపు రీకౌంటింగ్ పూర్తి కావాలి. రీకౌంటింగ్ జరగనుండటంతో, ఎన్నికల్లో ఓడిపోయిన హిల్లరీ వర్గీయుల్లో ఆశాభావం నెలకొంది.