: దొంగను పట్టుకోవడానికి జీపు నుంచి దూకి, దుర్మరణం పాలయ్యాడు
జీపులో వెళుతున్న సమయంలో తప్పించుకోవడానికి యత్నించాడో దొంగ. వేగంగా వెళ్తున్న జీపు నుంచి కిందకు దూకాడు. దీంతో, అతని పక్కనే ఉన్న కానిస్టేబుల్ రాఘవేంద్ర ఒక్కసారిగా షాక్ కు గురై... దొంగను పట్టుకోవడానికి అతను కూడా కిందకు దూకాడు. అయితే, జీపు వేగానికి అదుపుతప్పి కిందకు పడిపోయాడు. దీంతో, తీవ్రగాయలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో స్థానిక పోలీసుల్లో విషాదం నెలకొంది.