: ఎన్నికల తాయిలాలు.. ఇకపై గోవా యువతకు ఫ్రీ టాక్ టైమ్, డేటా!


గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం యువతను ఆకర్షించేందుకు ఒక పథకాన్ని ప్రకటించింది. దేశంలోనే ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా యువతకు ఫ్రీ టాక్ టైమ్, ఫ్రీ డేటా ఉచితంగా అందించనుంది. ‘గోవా యువ ఇనిషియేటివ్ స్కీమ్’ పేరుతో 100 నిమిషాల టాక్ టైమ్, 2 ఎంబీపీఎస్ స్పీడ్ తో 1జీబీ డేటాను ఉచితంగా అందిస్తామని గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ పేర్కొన్నారు. 16 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువకులు ఈ స్కీమ్ కు అర్హులని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతను అనుసంధానం చేయడంతో పాటు, వారిలో స్కిల్ డెవలప్ మెంట్ కు ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. గోవా వ్యాప్తంగా 500 కు పైగా వొడాఫోన్ రిటైల్ అవుట్ లెట్లను ఏర్పాటు చేసి మరో పదిహేను రోజుల్లో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను వొడాఫోన్ సంస్థ ప్రారంభించనుందని పర్సేకర్ తెలిపారు. కాగా, ‘గోవా యువ ఇనిషియేటివ్ స్కీమ్’ ద్వారా సేవలు అందించేందుకు ‘జియో’, ‘ఐడియా’తో పాటు ‘వొడాఫోన్’ సంస్థలు పోటీపడ్డాయి. చివరకు, ఈ బిడ్ ను ‘వొడాఫోన్’ దక్కించుకుంది.

  • Loading...

More Telugu News