: కూకట్ పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి దుర్మరణం
హైదరాబాద్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి దుర్మరణం చెందాడు. కూకట్ పల్లి పరిధిలోని మూసాపేట్-కైతలాపూర్ మార్గంలోని యూ-టర్న్ వద్ద వేగంగా వెళుతున్న బైక్, కారుని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ పై వెళుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి కోటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ, బల్కంపేటలో నివాసము ఉంటున్న ఎ.కోటేశ్వరరావు అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్, నానక్ రామ్ గూడలోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.