: చంద్రబాబుని కలిశాం.. నిరంకుశంగా స్పందించారు: వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడితో భేటీ ముగిసింది. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తమ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను సీఎంకు లిఖిత పూర్వకంగా తెలిపామని అన్నారు. ప్రజా సమస్యలపై సానుకూల ఆలోచన చంద్రబాబుకి ఉన్నట్లు కనపడడం లేదని వ్యాఖ్యానించారు. సమావేశం ఎంతో నిరాశజనకంగా జరిగిందని, చంద్రబాబు నిరంకుశంగా స్పందించారని చెప్పారు.