: చంఢీగ‌ఢ్ నుంచి హైద‌రాబాద్ బ‌య‌లుదేరిన మోదీ.. డీజీపీల‌ స‌ద‌స్సును ప్రారంభించిన రాజ్‌నాథ్‌


హైద‌రాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడ‌మీలో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన అన్ని రాష్ట్రాల డీజీపీలు, నిఘా విభాగాల అధిప‌తుల స‌మావేశం ప్రారంభ‌మైంది. కేంద్ర హోంశాఖ‌ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ స‌ద‌స్సును ప్రారంభించారు. అంత‌కు ముందు శంషాబాద్ విమానాశ్ర‌యానికి చేరుకున్న రాజనాథ్ సింగ్‌కు రాష్ట్ర‌ గవర్నర్ నరసింహన్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ స‌దస్సులో పాల్గొన‌డానికి ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ ఈ రోజు 6.35గంట‌ల‌కు హైద‌రాబాద్ చేరుకోనున్నారు. చంఢీగ‌ఢ్‌లో ప‌ర్య‌టించిన మోదీ.. అక్క‌డి నుంచి హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరారు.

  • Loading...

More Telugu News