: ప్రత్యేక ప్యాకేజీపై లోక్‌సభలో గల్లా జయదేవ్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీపై లోక్‌సభలో గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ ఈ రోజు స్పందించింది. అందుకు సంబంధించి లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ఇటీవల ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించామని అందులో పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం సాయం అందిస్తున్నామని పేర్కొంది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికీ ఇవ్వని సాయాన్ని రాష్ట్రానికి ఇస్తున్నామని పేర్కొంది. ఇప్పటికే ప్రత్యేక సాయం ప్రకటించామని, ఏపీ నేతలు ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారని కూడా ఇందులో పేర్కొంది. కేంద్ర మంత్రి అర్జున రామ్ మేఘ్వాల్ పేరు మీదట ఈ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అందుతుందని, తాము పేర్కొన్న సాయాన్ని అందిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.