: సభలోనేమో మౌనంగా వుంటారు.. బయటేమో భారీ ప్రసంగాలు చేస్తారు!: ప్రధానిపై మాయావతి విసుర్లు
ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాలు చెబుతున్నారని బహుజన సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. రాజ్యసభలో ఆమె మాట్లాడుతూ, పార్లమెంటులో పెద్ద నోట్ల రద్దుపై మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్న ప్రధాని పార్లమెంటు బయట సభల్లో మాత్రం భారీ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. అదే నోటితే విపక్షాలు నల్లధనానికి కొమ్ముకాస్తున్నాయని అంటున్నారు... మళ్లీ విపక్షాలు తమ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయని చెబుతున్నారని మండిపడ్డారు. ఇంతకీ ప్రధాని ఏం చెప్పాలనుకుంటున్నారు, విపక్షాలు సమర్థిసున్నాయనా? లేక వ్యతిరేకిస్తున్నాయనా? అని ఆమె అడిగారు. ప్రధాని సభకు వచ్చి నోట్ల రద్దుపై మాట్లాడాలని, విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేకుంటే ఆయనే సభకు వచ్చి మాట్లాడవచ్చుకదా? అని ఆమె నిలదీశారు.