: రాజ్యాంగాన్ని గుర్తుచేసుకుంటే అంబేద్కర్ ను స్మరించుకున్నట్టే!: మోదీ
రాజ్యాంగాన్ని గుర్తుచేసుకుంటే అంబేద్కర్ ను స్మరించుకున్నట్టేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ భవన్ లో 'మేకింగ్ ఆఫ్ కాన్ స్టిట్యూషన్' అనే పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నల్లధనంపై ఉమ్మడి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అవినీతి, నల్లధనంపై సామాన్యుడు సైతం సైనికుడిలా పోరాడాలని సూచించారు. సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాపారలావాదేవీలన్నీ ఆన్ లైన్ లో నిర్వహించాలని, నగదు రహిత లావాదేవీల దిశగా అడుగులు వేయాలని సూచించారు. యువతలో రాజ్యాంగం పట్ల అవగాహన పెంచేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.