: వైసీపీ ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన సీఎం.. సాయంత్రం భేటీ!


దాదాపు 30 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరగా, అందుకు అంగీకరించిన సీఎం వారికి సమయమిచ్చారు. వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైసీపీ శాసభసభ్యులు చంద్రబాబును కలవనున్నారు. కాగా, తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులపై చర్చించేందుకు మాత్రమే సీఎంతో సమావేశం కానున్నట్టు వైకాపా వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబుతో వైకాపా ఎమ్మెల్యేల సమావేశం, ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త రాజకీయ చర్చలకు తెరలేపింది.

  • Loading...

More Telugu News