: యువరాజ్ సింగ్ పెళ్లికి గెస్టులు కేవలం 60 మంది మాత్రమే!
ఈ నెల 30వ తేదీన వివాహం చేసుకోనున్న స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇప్పటికే పలువురు ప్రముఖులకు వివాహ పత్రికలు ఇచ్చి ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నాడు. చండీగఢ్ లో జరిగే ఈ వేడుకలో కేవలం 60 మంది అతిథులు మాత్రమే పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 30న సిక్కు సంప్రదాయంలో, ఆపై 2న హిందూ సంప్రదాయంలో యువరాజ్, అతని దీర్ఘకాల ప్రేయసి హేజెల్ కీచ్ లు ఒకటి కానున్నారు. కాగా, నిన్న పార్లమెంట్ కు వెళ్లిన యువరాజ్, తన వివాహానికి రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.