: పతంజలిపై కేసు నమోదు చేయండి: అసోం మంత్రి ఆదేశం


ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థపై కేసు నమోదు చేయాలని మంత్రి ఆదేశించిన ఘటన అసోంలో చోటుచేసుకుంది. అసోంలోని తేజ్‌ పూర్‌ లో హెర్బల్, మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు పతంజలి సంస్థకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో పతంజలి సంస్థ పెద్ద గొయ్యిని తవ్వింది. ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఆ గొయ్యి తవ్వడంతో ఇటీవల రెండు ఏనుగులు ఆ గోతిలో పడి మృతి చెందాయి. గొయ్యి తవ్వి వదిలేసిన పతంజలి నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. దీంతో అసోం అటవీశాఖ మంత్రి ప్రమీల రాణి బ్రహ్మ స్పందించి, గొయ్యి తవ్వి అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టని పతంజలి సంస్థపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News