: కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ


కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా డిపాజిట్ అవుతున్న మొత్తాలపై తీసుకోనున్న చర్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న పరిస్థితులపై సంయుక్త కార్యదర్శుల ఆధ్వర్యంలో కేంద్ర బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించి, వెలుగు చూసిన పరిస్థితులపై చర్చించనున్నారు. దీంతో ఈ డిపాజిట్ లావాదేవీలపై పన్ను విధించే అంశం చర్చకు రానుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు, బ్యాంకులు చేపడుతున్న చర్యలపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News