: మన్మోహన్‌సింగ్‌తో కరచాలనం చేసిన మోదీ.. చిరునవ్వులు చిందిస్తూ కబుర్లు
ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు రాజ్యసభ భోజన విరామ సమయంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ కరచాలనం చేశారు. రాజ్యసభలో ప్రసంగించిన అనంతరం విరామంలో మన్మోహన్‌సింగ్ సభలో నుంచి బయటకు వస్తుండగా ఆయనను చూసిన మోదీ పలకరించారు. ఇరువురు నేతలూ చేతిలో చెయ్యి వేసుకొని చిరునవ్వులు చిందిస్తూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అంతేకాదు, అక్కడే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్‌శర్మలను కూడా మోదీ పలకరించారు. ఓ వైపు ఈ రోజు రాజ్యసభలో పెద్దనోట్ల రద్దు అంశంపై మోదీపై మన్మోహన్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.