: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తమ ఉద్యోగులకు కాస్త నగదు ఇస్తున్న హర్యానా ప్రభుత్వం
పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన అనంతరం దేశ వ్యాప్తంగా వరసగా 17వ రోజు నగదు కొరత సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎం కేంద్రాల ముందు నో క్యాష్ బోర్డులు కనిపిస్తుండడం, బ్యాంకుల్లో విత్ డ్రా పరిమితి విధించడంతో ప్రజలు డబ్బు కోసం కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఈ రోజు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సీ, డీ కేటగిరీ ప్రభుత్వోద్యోగులందరికీ వారి వేతనాల నుంచి నేరుగా పది వేల రూపాయల నగదు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.