: వాహనదారులకు మరింత ఊరట.. టోల్ గేట్ల రుసుము రద్దు గడువు పెంపు
పెద్దనోట్ల రద్దు తరువాత వాహనదారులు జాతీయ రహదారులపై టోల్‌గేట్ల రుసుము చెల్లించే అవసరం లేకుండా మినహాయింపును ప్రకటిస్తూ వస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మరోసారి వాహనదారులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. టోల్‌గేట్ల రుసుము రద్దు గడువును వచ్చేనెల 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. పెద్దనోట్ల రద్దు ప్రకటన చేసిన అనంతరం టోల్‌గేట్ల వద్ద సిబ్బంది రద్దయిన నోట్లను అంగీకరించకపోవడం, వాహనదారుల వద్ద చిల్లర లేకపోవడంతో గందరగోళం నెలకొని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ చిల్లర కొరత తీరలేదు. ఈ నేపథ్యంలో టోల్‌గేట్ల రుసుము రద్దు కాలపరిమితిని సర్కారు పెంచుకుంటూ వస్తోంది.