: గుంటూరులో కల్తీకారం కలకలం... గోదాముల్లో ఏకంగా 6,500 బస్తాలు స్వాధీనం


మిర్చికి ప్రసిద్ధి చెందిన గుంటూరులో పెద్ద ఎత్తున కల్తీ కారం బయటపడుతుండడం కలకలం రేపుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసేలా క‌ల్తీ కారాన్ని త‌యారు చేస్తూ సొమ్ము చేసుకోవాల‌నుకుంటున్న‌ మాఫియాపై జిల్లా అధికారులు దాడులు జ‌రిపి కేసులు నమోదు చేస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా అధికారులు జ‌రుపుతున్న త‌నిఖీల్లో వేల బ‌స్తాల కొద్దీ క‌ల్తీ కారం బ‌య‌ట‌ప‌డుతోంది. ఈ రోజు జిల్లాలోని శాంభవి శీతల గోదాములో 2,500 బస్తాలు, లక్ష్మీవల్లభ గోదాములో 4వేల బస్తాల క‌ల్తీ కారాన్ని తాము స్వాధీనం చేసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. అంతేగాక‌, గోదాముల నుంచి నకిలీ మిరప విత్తనాలు, క‌ల్తీ కారం త‌యారీకి ఉప‌యోగించే పదార్థాలను సీజ్ చేశారు. కల్తీ మాఫియాపై రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేసి, గోదాముల్లో మెరుపు దాడులు చేయాలని ఆదేశించడంతో అధికారులు క‌ల్తీగాళ్ల ఆట‌లు క‌ట్టిస్తున్నారు. వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News