: ఇండియాలోని అత్యుత్తమ విద్యా సంస్థగా ఖరగ్ పూర్ ఐఐటీ!
విద్యా ప్రమాణాలు, ప్రాంగణ నియామకాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా టాప్ వర్శిటీల జాబితాను ‘క్యూఎస్ ఎంప్లాయబిలిటీ’ అనే సంస్థ అంతర్జాతీయ సర్వే చేసి వెల్లడించింది. ఇండియాలోని విద్యా సంస్థల్లో ఖరగ్ పూర్ లోని ఐఐటీ వరుసగా రెండో సంవత్సరం తొలి స్థానంలో నిలిచి సత్తా చాటింది. క్యాంపస్ ప్లేస్ మెంట్ల నుంచి విద్యా ప్రమాణాల వరకూ ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ విద్యా సంస్థల జాబితాను రూపొందించారు. ఇక అంతర్జాతీయంగా స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ ఫస్ట్ ప్లేస్ లో వుండగా, 'వరల్డ్ టాప్-100' వర్శిటీల్లో ఖరగ్ పూర్ తో పాటు ముంబై ఐఐటీలకు చోటు లభించింది. టాప్ - 200 వర్శిటీల్లో మద్రాస్, ఢిల్లీ ఐఐటీలు, ఢిల్లీ యూనివర్శిటీలకు స్థానం లభించింది.