: మోదీని అంతగా పొగడద్దు... నితీశ్ కుమార్ కు గట్టి వార్నింగ్ ఇస్తున్న కూటమి మిత్రులు


పాత నోట్లను రద్దు చేసిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీని బీహార్ ముఖ్యమంత్రి పదే పదే పొగుడుతుండటాన్ని మహాకూటమిలోని ఇతర పార్టీలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. నితీశ్ వైఖరి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన కాంగ్రెస్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లు ఆయన్ను హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇండియాలో పన్ను ఎగవేతలను నిలువరించేందుకు మోదీ ట్రిగ్గర్ నొక్కారని, మోదీ నోట్ల రద్దు నిర్ణయం ఇండియాకు ఎంతో మేలు చేస్తుందని తొలి రోజే అభిప్రాయపడ్డ నితీశ్, ఆపై పలుమార్లు ఆయన పనికి మెచ్చుకోలుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇక బ్యాంకుల ముందు క్యూలలో నిలబడి నిలబడీ కొంతమంది మరణిస్తుండటం, ఏటీఎంలలో నగదు కొరత, కొత్త నోట్లను ముందుగా సిద్ధం చేసుకోవడంలో వైఫల్యం తదితరాలపై కాంగ్రెస్ ఉద్యమిస్తున్న వేళ, కూటమిలో ఉన్న నేతగా నితీశ్, స్వయంగా మోదీని పొగడటం మంచిది కాదని, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతోందని బీహార్ లో మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ చౌదరి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి నిజాలను నితీశ్ ప్రస్తావించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News