: విశాఖ విద్యార్థులకు యుద్ధ నౌకలను తిలకించే అవకాశం
ఈ నెల 26వ తేదీన విశాఖపట్ణంలో యుద్ధ నౌకలను విద్యార్థులు తిలకించవచ్చు. ఈ మేరకు నౌకాదళం అధికారులు ఒక ప్రకటన చేశారు. నేవీ వారోత్సవాల్లో భాగంగా యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సాత్పురా, కమోర్టా లను సందర్శించే అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు.