: యువకుడి కిడ్నాప్, అత్యాచారం... కేసు నమోదు!
అవును, మీరు చదివింది నిజమే...యువకుడిని కిడ్నాప్ చేసి రేప్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇంత వరకు కిడ్నాప్, అత్యాచారం అంటే మహిళలపై మాత్రమే జరిగే దారుణం అనే మాటకు ముగ్గురు వ్యక్తులు కొత్త భాష్యం చెప్పారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... నోయిడా సమీపంలోని 63వ సెక్టార్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి, నైట్ డ్యూటీకి వెళ్లి తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేశారు. అనంతరం అతనిపై అత్యాచారం చేశారు. అనంతరం బాధితుడు స్పృహ కోల్పోవడంతో లైంగికదాడికి పాల్పడ్డ నిందితులను గుర్తించలేకపోయాడని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టామని అన్నారు.