: పెద్దనోట్ల రద్దు బాధాకరం: తలసాని శ్రీనివాస్ యాదవ్


పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బాధాకరమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాదులో హైటెక్స్‌లో జరుగుతున్న పౌల్ట్రీ 10వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో పౌల్ట్రీ రంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. పౌల్ట్రీ రంగం నిలదొక్కుకునే సందర్భంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో తెలంగాణలో పౌల్ట్రీ రంగానికి చేయూత పెరిగిందని ఆయన తెలిపారు. అంగన్ వాడీల ద్వారా 25 లక్షల గుడ్లు సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం కారణంగా గుడ్లు, చికెన్ వ్యాపారం చిల్లర లేక పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. పౌల్ట్రీ రంగానికి భవిష్యత్తులో మరిన్ని రాయితీలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News