: ప్రతి పక్షాలను ఎద్దేవా చేసిన పరేష్ రావల్


గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేసినంత మాత్రాన పాపాలు తొలగిపోతాయా? అని ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ పరేష్ రావల్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తమకు ముందే ఎందుకు తెలియలేదా? అని ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు వల్ల నల్లధనం కట్టడి అవుతుందని, నకిలీ నోట్లకు చెక్ పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని పరేష్ రావల్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా నల్లధనం కోల్పోయినవారే కేకలు పెడుతున్నారని ఆయన విమర్శించారు. కాగా, పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News