: పార్లమెంటు ఉభ‌య స‌భ‌లు ప్రారంభం... వెల్‌లోకి వెళ్లి విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న.. వాయిదా


పెద్ద‌నోట్ల ర‌ద్దుపై ప్ర‌తిప‌క్షాలు ఈ రోజు మరింత గ‌రం అయ్యాయి. స‌భ‌లో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశాయి. సభలో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో ప్రారంభ‌మైన ఐదు నిమిషాల‌కే లోక్‌స‌భ‌ను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ పేర్కొన్నారు. మ‌రోవైపు రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నేత‌లు కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. మోదీ వ‌చ్చి స‌మాధానం చెప్పాల్సిందేన‌ని ప‌ట్టుబడుతున్నారు. ప్ర‌ధాని ఓ ప్ర‌క‌ట‌న చేయాల్సిందేనంటూ నినాదాలు చేస్తున్నారు. ప‌లువురు విప‌క్ష‌నేత‌లు ఛైర్మ‌న్‌ పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులు ప్ర‌దర్శించారు. వెల్‌లోకి వెళ్లి విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న చేయడంతో రాజ్య‌స‌భ‌ను వాయిదా వేస్తున్న‌ట్లు డిప్యూటీ ఛైర్మ‌న్ కురియ‌న్ స‌భ‌ను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News