: సోషల్ మీడియాలో తమిళ హాస్యనటుడు గౌండమణీని చంపేశారు!


గత రెండు రోజులుగా తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో, స్వయంగా స్పందించాడు ప్రముఖ తమిళ హాస్య నటుడు గౌండమణి. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన తెలిపారు. కొంతమంది పనిగట్టుకుని వాట్స్ యాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లలో పుకార్లను వ్యాపింపచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తప్పుడు సమాచారాన్ని పంపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెన్నై మెట్రోపాలిటన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. గౌండమణి న్యాయవాది శశికుమార్ చెన్నై కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. గౌండమణి చాలా ఆరోగ్యంగా ఉన్నారని, ఇటువంటి పుకార్లు ప్రచారం చేయవద్దనీ కోరారు.

  • Loading...

More Telugu News